ePaper
Sunday, October 25, 2026
ePaper
Homeఎడిటోరియల్కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్

కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ పొట్లపల్లి లక్ష్మణ్ మృతి పార్టీ కి తీరని లోటు

మృతుడి కుటుంబానికి క్వింటా బియ్యం నెలకు సరిపడా సరుకులు వితరణ.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మిగౌడ్ చిలువేరు కు కృతజ్ఞతలు.

స్థానిక సర్పంచ్ సారం పెళ్లి దేవేంద్రమోహన్ రెడ్డి,గ్రామపార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి

నమస్తే భారత్ :-కేసముద్రం

మహబూబాబాద్ జిల్లా ​కేసముద్రం మండలం, పెద్దమోరి తండా గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ ఉప సర్పంచ్ పొట్లపల్లి లక్ష్మణా చారీ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన విషయం స్థానికి గ్రామ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి,యువజన వార్డు సభ్యులు తెలియజేయగ అధ్యక్షులు సమ్మిగౌడ్ స్థానిక సర్పంచ్ సారంపల్లి దేవేంద్ర మోహన్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కీ,, శే,,లక్మణా చారి ఇంటికి చేరుకొని వారికుటింబీకులను పరామర్శించి, వారి చిత్ర పటానికి పూలమాల వేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు..లక్షమణాచారి కుటుంబీకులు కాంగ్రెస్ పార్టీ కి విధేయలు ఉన్నారని,వారి మృతి పార్టీ కి తీరని లోటని,ఇలాంటి సమయం లో వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాలని వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు..ఇలాంటి సందర్బంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి మండల కాంగ్రెస్ పార్టీ కి తెలియజేసి సహాయం అందేలా జేయ్యడం,వారు అండగా నిలబడడం గ్రామ కాంగ్రెస్ పార్టీ ని హర్షించదగ విషయమని అన్నారు..

​ తక్షణ సాయం – కొండంత అభయం

​స్థానిక పార్టీ అధ్యక్షుల ద్వారా లక్ష్మణ్ మరణ వార్త తెలుసుకున్న సమ్మయ్య గౌడ్, వెంటనే బాధిత కుటుంబ ఇంటికి చేరుకుని లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో లక్ష్మణ్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని తెలుసుకుని చలించిపోయిన సమ్మయ్య గౌడ్, మానవత్వంతో స్పందించారు. ఆ కుటుంబానికి కొండంత అభయాన్నిస్తూ ఒక క్వింటా బియ్యంతో పాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను స్వయంగా అందజేశారు.

అధ్యక్షులు ​సమ్మయ్య గౌడ్ కు,గ్రామ సర్పంచ్, గ్రామ పార్టీ కృతజ్ఞతలు

​”నాయకుడు అంటే కేవలం అధికారం చలాయించేవాడు కాదు.కష్టాల్లో ఉన్నవారికి సేవ చేసేవాడే నిజమైన నాయకుడు” అని సమ్మయ్య గౌడ్ తన ఉదారతతో మరోసారి చాటిచెప్పారని స్థానిక సర్పంచ్ సారంపెళ్లి దేవేంద్ర మోహన్ రెడ్డి కొనియాడారు. కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ, వారికి భరోసానిస్తున్న మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ కు ఈ సందర్భంగా సర్పంచ్ మరియు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. సమ్మయ్య గౌడ్ చేస్తున్న సామాజిక సేవ పట్ల కేసముద్రం మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అయ్యి మొదటి సారిగా కాలనీకి వచ్చిన సందర్భంగా మేడి శ్రీనివాస్,అరుణ్ అంబేద్కర్ కాలనీవాసులు శాలువతో సన్మానించి వారి అభిమానాన్ని చాటుకున్నారు…

ఈ కార్యక్రమంలో గ్రామాపార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి,కంటిపూడి అరుణ్ కుమార్, మేడి శ్రీనివాస్,వార్డ్ నెంబర్ మూతి సురేందర్, శంకర్, శీలం యాకన్న, యా కన్నా, బండారి నరేష్, ప్రభాకర్, లవన్న, కుశన్న, దుగ్గి యాకయ్య, బండారి పెద్ద వెంకన్న, బండారి మనోజ్, లక్ష్మణ్, వెంకన్న, రవి, జాటోత్ ప్రవీణ్, కిషన్ ఉపసర్పంచ్ హాలు, ప్రవీణ్, సునీల్, రాకేష్, గాండ్ల మలేంద్రం, దుగ్గి శివ,కొప్పెర ఉదయ్ పులినరీ సారంపల్లి వెంకన్న, కమ్మ యాకమ్మ, గంధసిరి పద్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!