ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeఎడిటోరియల్జాతీయ సేవా పథకం (NSS) దినోత్సవం ప్రత్యేకం

జాతీయ సేవా పథకం (NSS) దినోత్సవం ప్రత్యేకం

📰 Generate e-Paper Clip

జాతీయ సేవా పథకం (NSS) దినోత్సవం ప్రత్యేకం

“నేను కాదు మీరు ” నుంచి వికసిత్ భారత్–2047 వరకు… యువత సేవా స్ఫూర్తికి 57 ఏళ్ల ప్రస్థానం
హైదరాబాద్, సెప్టెంబర్ 24: దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాలలో ఒకటైన జాతీయ సేవా పథకం నేడు 57వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 1969లో మహాత్మా గాంధీ జన్మశతాబ్ది సందర్భంగా ప్రారంభమైన ఈ ఉద్యమం, “నేను కాదు మీరు ” అనే సేవా తత్వంతో కోట్లాది మంది విద్యార్థులను సమాజ సేవ వైపు నడిపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఉన్నత పాఠశాలల ద్వారా లక్షలాది మంది ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య అవగాహన, రక్తదానం, గ్రామాభివృద్ధి వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.ఆలోచన నుంచి ఉద్యమం వరకు
స్వాతంత్ర్యం అనంతరం విద్యతో పాటు సామాజిక సేవను అనుసంధానించాలనే ఆలోచనకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్, కేంద్ర విద్యా సలహా మండలి (CABE), మొదటి పంచవర్ష ప్రణాళిక బలమైన పునాది వేశాయి. అనంతరం 1958లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా విద్యార్థుల సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంలో 1969 సెప్టెంబర్ 24న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డా. వి.కె.ఆర్.వి. రావు 37 విశ్వవిద్యాలయాల్లో 40 వేల మంది విద్యార్థులతో NSSను ప్రారంభించారు. కోణార్క్ చక్రంలో సేవా సందేశం
ఎన్ ఎస్ ఎస్ చిహ్నం ఒడిశాలోని ప్రసిద్ధ కోణార్క్ సూర్యదేవాలయ రథచక్రాన్ని ఆధారంగా రూపొందించబడింది. చక్రంలోని ఎనిమిది అంచులు రోజులోని 24 గంటల సేవా సిద్ధతను సూచిస్తే, ఎరుపు రంగు యువశక్తిని, నీలం రంగు విశ్వ మానవ సేవను ప్రతిబింబిస్తాయి. “నేను కాదు మీరు ” అనే సూక్తి వ్యక్తిగత ప్రయోజనం కంటే సమాజ సంక్షేమమే గొప్పదనే భావనను యువతలో నాటుతోంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే “వికసిత్ భారత్” లక్ష్యానికి ఎన్ ఎస్ ఎస్ సహజ భాగస్వామిగా నిలుస్తోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. గ్రామాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత, మహిళా సాధికారత, నీటి సంరక్షణ, వృక్షారోపణ, విపత్తు నిర్వహణ వంటి కార్యక్రమాల ద్వారా ఎన్ ఎస్ ఎస్ ఇప్పటికే దేశాభివృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతోంది.
సుస్తీర అభివృద్ధి లక్ష్యాలతో సహజ అనుసంధానం
ఐక్యరాజ్యసమితి రూపొందించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధనలో కూడా ఎన్ ఎస్ ఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆరోగ్య శిబిరాల ద్వారా ఎస్ డి జి -3, విద్యా కార్యక్రమాల ద్వారా ఎస్ డి జి -4, మహిళా సాధికారత ద్వారా ఎస్ డి జి -5, పరిశుభ్రత ద్వారా ఎస్ డి జి -6, వాతావరణ చర్యల ద్వారా ఎస్ డి జి -13, పర్యావరణ పరిరక్షణ ద్వారా ఎస్ డి జి -15, బాధ్యతాయుత పౌరసత్వం ద్వారా ఎస్ డి జి -16 లక్ష్యాల సాధనకు వాలంటీర్లు కృషి చేస్తున్నారు.నేటి సవాళ్లకు నేటి ఎన్ ఎస్ ఎస్
కృత్రిమ మేధస్సు (, నిరుద్యోగం, వాతావరణ మార్పు, సైబర్ నేరాలు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి కొత్త సవాళ్ల నేపథ్యంలో ఎన్ ఎస్ ఎస్ పాత్ర మరింత విస్తరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఒక గ్రామ సమస్యకు వినూత్న పరిష్కారం చూపే “వన్ విలేజ్–వన్ ఇన్నోవేషన్”, ప్రతి వాలంటీర్ నైపుణ్యాలను నమోదు చేసే “స్కిల్ బ్యాంక్”, డిజిటల్ సేవా వేదికల ఏర్పాటు వంటి చర్యలు భవిష్యత్తులో ఎన్ ఎస్ ఎస్ ను మరింత ప్రభావవంతంగా మార్చగలవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సేవే నిజమైన నాయకత్వం
57 ఏళ్ల ప్రస్థానంలో ఎన్ ఎస్ ఎస్ కేవలం ఒక ప్రభుత్వ పథకంగా కాకుండా, సేవ ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని, వ్యక్తిత్వం ద్వారా దేశాభివృద్ధిని సాధించే యువజన ఉద్యమంగా నిలిచింది. “నేను కాదు మీరు ” అనే సేవా స్ఫూర్తిని “వికసిత్ భారత్–2047” లక్ష్యంతో కలిపినప్పుడు ప్రతి విద్యార్థి ఒక చేంజ్ మేకర్, ప్రతి కళాశాల ఒక కమ్యూనిటీ ఇన్నోవేషన్ హబ్, ప్రతి గ్రామం ఒక అభివృద్ధి ప్రయోగశాలగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మధుబాబు చికిలే,స్కిలోక్రాట్,జాతీయ డైరెక్టర్,ప్రపంచ మానవ హక్కుల సమితి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!