ePaper
Friday, September 11, 2026
ePaper
Homeఎడిటోరియల్శ్రీశైలంలో చిన్నారి అక్షయ నృత్య ప్రదర్శన

శ్రీశైలంలో చిన్నారి అక్షయ నృత్య ప్రదర్శన

📰 Generate e-Paper Clip

*శ్రీశైలంలో చిన్నారి అక్షయ నృత్య ప్రదర్శన*

నమస్తే భారత్ షాద్ నగర్, జూన్ 29 :శ్రీశైలం దేవస్థానంలో ఆదివారం రాత్రి నిర్వహించిన శ్రీశైల మహా క్షేత్ర నిత్య కళారాధన, శ్రీశైల నాట్య తరంగిణి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమంలో షాద్ నగర్ పట్టణానికి చెందిన నాట్య నివేదాలయం, కూచిపూడి నాట్య గురువు భార్గవి శిష్యురాలైన చిన్నారి అక్షయ తన అద్భుతమైన హవభావాలతో కూచిపూడి ప్రేక్షకులను, భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తి గీతాలకు అనుగుణంగా భావప్రకటన, హావభావాలు, లయబద్ధమైన అడుగులతో నృత్యం చేసి అందరి ప్రశంసలు అందుకుంది.
కార్యక్రమానికి హాజరైన భక్తులు, ప్రముఖులు చిన్నారి ప్రతిభను అభినందించారు. నిర్వాహకులు లావణ్య, అక్షయ కు మెమెంటో, ప్రశంస పత్రాన్ని అందించి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. చిన్నారులకు సంప్రదాయమైన కూచిపూడి నృత్య కళా ను నేర్పిస్తూ ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను వారు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!