ePaper
Sunday, June 28, 2026
ePaper
Homeఎడిటోరియల్28 తేదీన శంషాబాద్ వస్తున్న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కార్యక్రమం విజయవంతం చేద్దాం

28 తేదీన శంషాబాద్ వస్తున్న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కార్యక్రమం విజయవంతం చేద్దాం

📰 Generate e-Paper Clip

28 తేదీన శంషాబాద్ వస్తున్న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కార్యక్రమం విజయవంతం చేద్దాం

*ఎస్ ఐ ఆర్ పై బి ఎల్ ఏ 2 లకు అవగాహన కార్యక్రమం*

**ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్ కౌన్సిల్ మెంబర్ కందుకూరి మనోహర్ రెడ్డి*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్27: బిజెపి జిల్లేడు చౌదరిగూడ మండల అధ్యక్షుడుఎదిరరాజు గారి అధ్యక్షతన ఆర్య సమాజ్ లో జిల్లేడు చౌదరిగూడ మండల బూత్ అధ్యక్షులు,2 లతో జరిగిన సమావేశంలో మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ, భారత ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దేందుకు ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంU చేస్తున్నాయని అన్నారు. ఓటరు జాబితాలో ఉన్న లోపాలను సరి దిద్దడం, మరణించిన వారు, వేరే ప్రాంతాలకు మారిన వారి పేర్లను తొలగించడం, అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం వంటి లక్ష్యాలతో ఈ ప్రక్రియ కొనసాగుతోందని అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్‌ఐఆర్ ప్రక్రియను వక్రీకరించి ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని అన్నారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అని, ఆ సంస్థ చేపడుతున్న కార్యక్రమానికి రాజకీయ రంగు పుల మడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, పారదర్శకమైన ఓటరు జాబితా, ఎన్నికల నిష్పాక్షికతకు ఎంతో అవసరమని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం ఎంత ముఖ్యమో, అర్హత లేని పేర్లను తొలగించడం కూడా అంతే ముఖ్యం అన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల దుష్ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలనీ, ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.మరియు ఈ నెల 28 వ తేదీ ఆదివారం రోజు శంషాబాద్ లో రంగారెడ్డి జిల్లా బిజెపి కార్యాలయం ప్రారంభం అవుతుంది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వస్తున్నారు,తదుపరి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పోలింగ్ బూత్ అధ్యక్షులతో మరియు బి ఎల్ బి 2 లతో సమావేశం ఉంటుంది,కావున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క బూత్ అధ్యక్షుడు, 2, సీనియర్ నాయకులు పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత విభాగం కన్వీనర్ మచ్చ సుధాకర్ రావు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కమ్మరి భూపాల చారి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మాల నవీన్ జిల్లా కౌన్సిల్ మెంబర్ బోయ కురుమయ్య వీరన్నపేట్ డిప్యూటీ సర్పంచ్ పరిగి శివకుమార్ గొల్ల రాజు గొల్ల మల్లేష్ చెనగల కృష్ణయ్య గారు రవీందర్ రెడ్డి భీమయ్య వడ్ల శ్రీశైలం లింగం యాదగిరి అంజి విట్టల్ నర్సింహులు రామ్ ప్రశాంత్ మురళి శ్రీధర్.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!