ePaper
Thursday, July 2, 2026
ePaper
Homeఎడిటోరియల్శ్రీరామ్ నగర్‌లో సర్ ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన కూన శ్రీనివాస్ గౌడ్

శ్రీరామ్ నగర్‌లో సర్ ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన కూన శ్రీనివాస్ గౌడ్

📰 Generate e-Paper Clip

శ్రీరామ్ నగర్‌లో సర్ ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన కూన శ్రీనివాస్ గౌడ్

-అధికారులు, బీఎల్వోలతో కలిసి కార్యక్రమాన్ని పరిశీలించిన డీసీసీ ఉపాధ్యక్షులు

-ఓటర్లు వివరాలను నమోదు చేసుకుని ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపు

-ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్న ప్రత్యేక ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమం

-కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులు, బీఎల్వోలు, కార్యకర్తలు

కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ సర్కిల్ పరిధి రోడా మేస్త్రి నగర్ డివిజన్‌లోని శ్రీరామ్ నగర్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక సర్ ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ బుధవారం సంబంధిత అధికారులు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు), స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానిక ఓటర్లతో మాట్లాడిన కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమం ప్రతి ఓటరికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఓటర్లందరూ తమ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారంలో సక్రమంగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి అర్హ ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటరు జాబితాలో తమ వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుచ్చిరెడ్డి, గుమస్తా మధుసూదన్, వెంకటేష్, బాలకృష్ణ, బలరాం, రఘురెడ్డి, ఆసిఫ్, నరేష్, దత్తు, రజాక్, రాజిరెడ్డి, పాషా, రామకృష్ణ, రామ నరసయ్య, సంతోష్ తదితర స్థానిక నాయకులు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు), పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!