ePaper
Thursday, October 1, 2026
ePaper
Homeఎడిటోరియల్*రంగారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షుడిగా కే. నరసింహారెడ్డి*

*రంగారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షుడిగా కే. నరసింహారెడ్డి*

📰 Generate e-Paper Clip

*రంగారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షుడిగా కే. నరసింహారెడ్డి*

*ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఉపాధ్యక్షుడు*

నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్29:ఫరూఖ్‌నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన కే. నరసింహారెడ్డి (కే. ప్రతాప్ రెడ్డి కుమారుడు) రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నూతన బాధ్యతలు స్వీకరించిన కే. నరసింహారెడ్డి (చిలకమర్రి నరసింహారెడ్డి) షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించి, తన నియామకానికి సంబంధించిన విషయాలను తెలియజేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని కే. నరసింహారెడ్డి తెలిపారు. పార్టీ నాయకత్వం నిర్దేశించిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో, పార్టీ రాష్ట్ర నాయకత్వం మార్గదర్శకత్వంతో కాంగ్రెస్ పార్టీని అన్ని స్థాయిల్లో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఆ ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు పాముల అడివయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతారం కృష్ణ భీమయ్య తదితరులు ఆయన వెంట ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!