ePaper
Monday, October 12, 2026
ePaper
Homeఎడిటోరియల్ గిరిజన మహిళకు న్యాయం చేయాలి

 గిరిజన మహిళకు న్యాయం చేయాలి

📰 Generate e-Paper Clip

గిరిజన మహిళకు న్యాయం చేయాలి

డబ్బులు తీసుకొని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

బాధ్యులను అరెస్టు చేయకపోతే వేలాది గిరిజనులతో ధర్నా

ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు భూక్యా రామ్మూర్తి నాయక్‌

నమస్తే భారత్ :-మరిపెడ

మరిపెడ మండల కేంద్రంలో గిరిజన మహిళను మాయమాటలతో నమ్మించి రూ.25 లక్షలు తీసుకొని మోసం చేసిన వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు భూక్యా రామ్మూర్తి నాయక్‌ డిమాండ్‌ చేశారు. బాధితురాలికి న్యాయం చేయకపోతే ఎల్‌హెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో వేలాది మంది గిరిజనులతో మండల కేంద్రంలో భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.శనివారం మరిపెడ మండల కేంద్రంలో ఎల్‌హెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని హాని రెస్టారెంట్‌ వెనుక ఉన్న చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ప్రభుత్వ భూమిని తమ సొంత భూమిగా నమ్మించి, పట్టా ఉందని, రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని చెప్పి నీలుకుర్తి పరకాజాల తండాకు చెందిన నేతావత్‌ యకమ్మ నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు.భూమిపై అనుమానం వచ్చి అది ప్రభుత్వ చెరువుకు సంబంధించిన భూమి కాదా అని బాధితురాలు ప్రశ్నించగా, ఆమెను కులం పేరుతో దూషించి అవమానించినట్లు తెలిపారు. అధికార పార్టీలో పదవిలో ఉన్నానని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించిందన్నారు. అమాయక గిరిజన మహిళను మోసం చేయడం దారుణమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ ఘటనపై బాధితురాలు మరిపెడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు రామ్మూర్తి నాయక్‌ తెలిపారు. అయితే, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు వర్తించే ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని తొర్రూరు డీఎస్పీని కోరారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ సంఘం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.మరిపెడ మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ భూములను గుర్తించి, ఆక్రమణలు జరిగినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, నిర్లక్ష్యం వీడి భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు.బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోతే ఎల్‌హెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
[9:09 PM, 10/10/2026] +91 70369 31096: End

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!