పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూరు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వి రెడ్డి అన్నారు.తొర్రూరు మున్సిపాలిటీలోని 6వ వార్డు అంబేద్కర్ నగర్ కు చెందిన రామారపు రామచంద్రు భార్య రామారపు పద్మ చికిత్స నిమిత్తం కోసం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదివారం రూ. 5 లక్షల ఎల్ఓసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.పేదల ఆరోగ్యానికి కావాల్సిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొర్రూరు మాజీ సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పెదగాని సోమయ్య మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మామిడాల యశస్వి రెడ్డి పేదలకు అండగా నిలుస్తుందన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన పద్మకు వైద్యం చేయించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఎమ్మెల్యే ప్రభుత్వం నుండి ఎల్ఓసి అందించడం వల్ల వైద్యం చేయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.



