మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలి
ప్రజావాణి అధికారికి సిపిఎం పార్టీ మండల కమిటీ వినతి
నమస్తే భారత్ :-కేసముద్రం
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీ కార్యదర్శి గొడిశాల వెంకన్న మాట్లాడుతూ కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో గతంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలు గుర్తించి బోర్డులు పెట్టారు, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకొని మున్సిపాలిటీ పరిధిలో క్రీడా మైదానాలు, మినీ పార్కులు ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాల కోసం వినియోగించాలని, అలాగే జ్యోతిబాపూలే సెంటర్లో బస్ షెల్టర్ ఏర్పాటు చేసి, ప్రధాన కూడల్ల లో పబ్లిక్ టాయిలెట్స్ (సులాబ్ కాంప్లెక్స్ )లు నిర్మించాలని, అభివృద్ధి రోడ్ల విస్తరణలో భాగంగా షాపులు కోల్పోయిన, చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులు, వ్యాపారుల కోసం షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించి ఇవ్వాలని, కేసముద్రం మండలంలో మొదటిసారి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులకు విన్నవించడం జరిగింది, అధికారులు సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని లేనియెడల ప్రభుత్వ భూములను ఎర్రజెండాలు పెట్టి పేదలకు పంచుతామని, ప్రజా సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు చాగంటి కిషన్, నీరుటి జలంధర్, అల్పుగొండ సావిత్ర, బండి దర్గయ్య, నిమ్మల ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు



