ePaper
Friday, September 11, 2026
ePaper
Homeఎడిటోరియల్అర్ధరాత్రి అదుపుతప్పిన కారు.. తప్పిన పెను ప్రమాదం

అర్ధరాత్రి అదుపుతప్పిన కారు.. తప్పిన పెను ప్రమాదం

📰 Generate e-Paper Clip

అర్ధరాత్రి అదుపుతప్పిన కారు.. తప్పిన పెను ప్రమాదం

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మునిసిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలోని.ప్రమాదకరమైన.మూలమలుపు వద్ద ఆదివారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. కారులో నలుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదే ప్రాంతంలో ఇటీవల 30కిపైగా వాహనాలు ప్రమాదాలకు గురికాగా, 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ప్రమాదకర మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, డివైడర్ కారణంగా రహదారి ఇరుకుగా మారడంతో తరచూ ప్రమాదాలు.జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇరుకు మలుపులను తొలగించి రహదారిని.విస్తరించడంతోపాటు, మలుపుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!