ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeఎడిటోరియల్జర్నలిస్ట్ కాలనీ సమస్యలు పరిష్కరించాలి – కౌన్సిల్‌కు జర్నలిస్టుల వినతి

జర్నలిస్ట్ కాలనీ సమస్యలు పరిష్కరించాలి – కౌన్సిల్‌కు జర్నలిస్టుల వినతి

📰 Generate e-Paper Clip

జర్నలిస్ట్ కాలనీ సమస్యలు పరిష్కరించాలి – కౌన్సిల్‌కు జర్నలిస్టుల వినతి

నమస్తే భారత్ :-మరిపెడ

మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని అయ్యప్ప గుడి సమీపంలోనీ జర్నలిస్ట్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని మరిపెడ జర్నలిస్టులు కోరారు. గురువారం ఈ మేరకు మరిపెడ కౌన్సిల్ సమావేశంలో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ! మున్సిపల్ అధికారులు జర్నలిస్ట్ కాలనీలో మౌలిక వసతులు కల్పించడానికి సానుకూలంగా ఉన్నట్లు వారు తెలిపారు. జర్నలిస్టు కాలనీలో మౌలిక వసతులు లేకపోవడంతో ఇండ్లు.శిథిలావస్థకుచేరుతున్నాయన్నారు. అధికారులు స్పందించి తాగునీరు, సిసి రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో మరిపెడ జర్నలిస్టులు ఎస్కే. సత్తార్ పాష బి. నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!