ePaper
Friday, September 11, 2026
ePaper
Homeఎడిటోరియల్*ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయానికి భూమిపూజ*

*ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయానికి భూమిపూజ*

📰 Generate e-Paper Clip

*ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయానికి భూమిపూజ*

*13న ఉప్పల్ భగాయత్‌లో భూమిపూజ, శ్రీనివాస కళ్యాణం ఆత్మీయ సమ్మేళనం*

నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్11:హైదరాబాద్: ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, సమాజ అభివృద్ధి మరియు ఐక్యతకు వేదికగా నిలవనున్న ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం నిర్మాణానికి ఈ నెల 13వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో కేటాయించిన స్థలంలో భూమిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గందె సురేష్ గుప్తా తెలిపారు.తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గందె సురేష్ గుప్తా తెలిపారు.
భూమిపూజ మహోత్సవంతో పాటు శ్రీనివాస కళ్యాణాన్ని కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.భూమిపూజ కార్యక్రమం అనంతరం ఉదయం 10:30 గంటలకు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.
ఈ సమ్మేళనంలో ఆర్యవైశ్య సమాజ ఐక్యత, అభివృద్ధి, యువత, మహిళలు, విద్యా మరియు సామాజిక సేవా కార్యక్రమాలపై ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. అలాగే పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, ఆర్యవైశ్య మహాసభ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, సమాజంలోని వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు, ఆర్యవైశ్యుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు ఈ భవనం ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తాలూకా సంఘాలు, మండల సంఘాలు, పట్టణ మరియు గ్రామస్థాయి ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, నాయకులు, యువత, మహిళలు, సమాజ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని గందె సురేష్ గుప్తా పిలుపునిచ్చారు.తేదీ: 13-09-2026, ఆదివారం
ఉదయం 8:00 గంటలకు: భూమిపూజ మహోత్సవం, శ్రీనివాస కళ్యాణం
ఉదయం 10:30 గంటలకు: ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం
వేదిక: ఉప్పల్ భగాయత్, హైదరాబాద్ఇట్లు,
గందె సురేష్ గుప్తా
అధ్యక్షులు, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!