డిసెంబర్ 15 నుంచి ఆశాల నిరవధిక సమ్మె మెడికల్ ఆఫీసర్లకు సమ్మె నోటీసులు

డిసెంబర్ 15 నుంచి ఆశాల నిరవధిక సమ్మె మెడికల్ ఆఫీసర్లకు సమ్మె నోటీసులు నర్సంపేట నవంబర్ 3(మల్లేష్ నమస్తే భారత్ ) : ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు తెలిపారు.ఈ మేరకు నర్సంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, బాంజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లకు ఆశా కార్యకర్తలతో కలిసి సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా గోనె యువరాజు మాట్లాడుతూ...