ePaper
Thursday, July 23, 2026
ePaper
Homeఎడిటోరియల్తెలంగాణ గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికుల బస్సు యాత్ర పోస్టర్‌ను...

తెలంగాణ గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికుల బస్సు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు.సమ్మయ్య.గౌడ్

📰 Generate e-Paper Clip

తెలంగాణ గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో

కల్లు గీత కార్మికుల బస్సు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన

గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు.సమ్మయ్య.గౌడ్

నమస్తే భారత్ :-కేసముద్రం

తెలంగాణ గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర కల్లు గీత కార్మికుల బస్సు యాత్ర పోస్టర్‌ను కేసముద్రంలో గోపా డివిజన్ అధ్యక్షులు.చిలువేరు.సమ్మయ్య.గౌడ్.ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం గీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు బబ్బురి ఉప్పలయ్య, మండల కార్యదర్శి మోడం ఉపేందర్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా చిలువేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ, గీత కార్మికుల హక్కుల పరిరక్షణ, గీత వృత్తి అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఈ బస్సు యాత్రను ప్రతి గీత కార్మికుడు తన సొంత కార్యక్రమంగా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వీరశివాజీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా తెలంగాణ గీత కార్మికుల సంక్షేమ సంఘం ప్రతి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు.గీత కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి. రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు తదితర రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బస్సు యాత్ర మహబూబాబాద్ జిల్లా నుంచి ప్రారంభం కావడం జిల్లాకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.ఆగస్టు 2వ తేదీ ఉదయం 11 గంటలలోపు మహబూబాబాద్‌లోని ఇల్లందు రోడ్డు ఆర్తి గార్డెన్స్ వద్ద రాష్ట్ర బస్సు.యాత్ర.ప్రారంభమవుతుందని, అక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం జెండా ఊపి యాత్రను.ప్రారంభిస్తారని.తెలిపారు. అనంతరం మహబూబాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి గూడూరు చేరుకుని రాత్రి బస చేయనున్నట్లు వివరించారు.
కేసముద్రం వైపు బస్ యాత్ర
ఆగస్టు 3వ తేదీ ఉదయం గూడూరు నుంచి బయలుదేరిన రాష్ట్ర బస్సు యాత్ర అప్పనపల్లి మీదుగా కేసముద్రం మండలానికి చేరుకుంటుందని తెలిపారు. ఉదయం 8 గంటలకు కేసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో కేసముద్రం ప్రధాన వీధుల గుండా మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి,పూలే కీ పూలమాల వేసిన అనంతరం బహిరంగ సభలో రాష్ట్ర నాయకులను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం రాష్ట్ర బస్సు యాత్రకు ఘనంగా సెండ్‌ఆఫ్ ఇచ్చి, తిమ్మంపేట,ఇనుగుర్తి మీదుగా మర్రిపేట వైపు సాగనంపనున్నట్లు వెల్లడించారు.అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలి-సమ్మిగౌడ్.గూడూరు నుంచి అప్పనపల్లి మీదుగా కేసముద్రం మండలంలోకి ప్రవేశించే రాష్ట్ర బస్సు యాత్రకు ఉమ్మడి కేసముద్రం మండలం లోని ప్రతి గ్రామం నుంచి కనీసం 50కు పైగా ద్విచక్ర వాహనాలతో బైక్ ర్యాలీగా తరలివచ్చి రాష్ట్ర బస్సు యాత్రను విజయవంతం చేయాలని, గీత కార్మికుల ఐక్యత, ఆత్మ గౌరవం మరియు సంఘటిత శక్తిని చాటిచెప్పేలా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని చిలువేరు సమ్మయ్య గౌడ్ పిలుపునిచ్చారు.ఈ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బబ్బురు ఉప్పలయ్య,మోడెం వెంకటేశ్వర్లు,మెడి వెంకటేశ్వర్లు పలుస వెంకన్న,ఓరుగంటి వెంకన్న, చింతనూరి వెంకన్న,ఇనుగుర్తి వెంకన్న, రడం వెంకన్న, కదిరా సోమయ్య,జోగు రవీందర్ రాంపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!