ePaper
Monday, September 7, 2026
ePaper
Homeతెలంగాణచిట్కూల్‌ కేజీబీవీలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు

చిట్కూల్‌ కేజీబీవీలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు

📰 Generate e-Paper Clip

చిట్కూల్‌ కేజీబీవీలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు
మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు
మెదక్,సెప్టెంబర్05(నమస్తే భారత్):
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా,చిలిపిచేడ్ మండల పరిధిలోని చిట్కూల్‌ కేజీబీవీలో శనివారం నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు క్రమశిక్షణ,నైతిక విలువలు,సామాజిక బాధ్యతలను నేర్పిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని ఎస్పీ పేర్కొన్నారు. విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుల కృషి, మార్గదర్శకత్వం ఉంటుందని అన్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన ఉమాదేవిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ అంజలి విద్యార్థులకు,నాణ్యమైన విద్య,భోజనం సరఫరా చేస్తూ,మారుమూల గ్రామాల్లో నుండి విధులకు విచ్చేస్తున్న అంజలి పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత తీసుకు రావటం పట్ల ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉత్తమ సేవలందించటం హర్షించదగ్గ విషయమని ఎస్పీ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.విద్యారంగానికి ఆమె అందిస్తున్న సేవలను ప్రశంసించారు.అనంతరం విద్యార్థినులతో ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడి పోక్సో చట్టం,సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు.బాలికలు తమకు ఎదురయ్యే ఇబ్బందులను పోలీసు అక్కదృష్టికి తీసుకురావాలని సూచించారు.ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు,పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు పంచుకోవద్దని సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని చెప్పారు.
విద్యార్థినుల విద్యాభ్యాసం,భవిష్యత్తు లక్ష్యాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఈకార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఏం.అంజలి,తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌ గౌడ్‌,ఎంఈఓ పాఠశాల అధ్యాపకులు,సీఐలు సందీప్‌రెడ్డి,రంగాకృష్ణ, ఎస్‌ఐ నర్సింలు,పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!