చిట్కూల్ కేజీబీవీలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు
చిట్కూల్ కేజీబీవీలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు మెదక్,సెప్టెంబర్05(నమస్తే భారత్): సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా,చిలిపిచేడ్ మండల పరిధిలోని చిట్కూల్ కేజీబీవీలో శనివారం నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు క్రమశిక్షణ,నైతిక విలువలు,సామాజిక బాధ్యతలను నేర్పిస్తూ వారి భవిష్యత్తును...