జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ నూతన ఈవోకు ఘన సన్మానం
-బీఆర్ఎస్ నాయకుడు కొలుకుల జైహింద్ మర్యాదపూర్వక అభినందనలు
-ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్ష
-మాజీ ఈవో కృష్ణమాచార్యుల సేవలను ప్రశంసించిన జైహింద్
-పాల్గొన్న పలువురు నాయకులు, భక్తులు
జగద్గిరిగుట్ట, జూలై 1 ( నమస్తే భరత్ ): జగద్గిరిగుట్ట కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన నూతన కార్యనిర్వాహణాధికారి (ఈవో)గా బాధ్యతలు స్వీకరించిన సతీష్‌ను బుధవారం బీఆర్ఎస్ నాయకుడు కొలుకుల జైహింద్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జైహింద్ మాట్లాడుతూ, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ఆలయ సమగ్ర అభివృద్ధికి నూతన ఈవో కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆలయ పురోగతికి తీసుకునే ప్రతి మంచి నిర్ణయానికి తన పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే, గతంలో ఈవోగా పనిచేసిన కృష్ణమాచార్యులు ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనలో చేసిన విశేష సేవలను ఆయన ప్రశంసించారు. నూతన ఈవో సతీష్ సారథ్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆలయ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, సుధాకర్‌రావు, నాయకులు నరసింహారెడ్డి, రాయి విఘ్నేష్, వేణుగౌడ్, మైలారం రాజు, సునీత, బత్తిని కళ్యాణ్, నరసయ్యతో పాటు పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.



