ePaper
Tuesday, September 22, 2026
ePaper
Homeఎడిటోరియల్ధర్మ రావు పేటలో ఘనంగా బీరప్ప బోనాలు

ధర్మ రావు పేటలో ఘనంగా బీరప్ప బోనాలు

📰 Generate e-Paper Clip

ధర్మ రావు పేటలో ఘనంగా బీరప్ప బోనాలు

ఖానాపురం జులై25 (నమస్తే భారత్ ) :

ఖానాపురం మండలం ధర్మ రావు పేట గ్రామంలో కురుమ గొల్లల ఆరాధ్య దైవం బీరప్ప బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఖానాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మార్కెట్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు , ఖానాపురం సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ యాదవ్ లు కలిసి బీరన్న కు మొక్కులు చెల్లించుకున్నారు. వారు ఈసందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురియాలని ,పాడి పంటలతో రైతుల ఇంట సిరులు కురిపించాలని కోరుకున్నామన్నారు. అనంతరం యాదవ సంఘం అద్వర్యంలో మార్కెట్ వైస్ చైర్మన్ హరిబాబు, సోసైటీ చైర్మన్ లతో పాటు పలువురిని శాలువలు కప్పి సన్మానించారు.
ఈకార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ లింగిడి వెంకటేశ్వర్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముదురు కుమారస్వామి ,ఉప సర్పంచ్ కొనుకటి రాజు కొనకండి రాంరెడ్డి సంఘం అధ్యక్షుడు అన్న అశోక్ కార్యదర్శి కుండే ప్రభాకర్ బొమ్మగాని నవీన్ ,గుట్టయ్య ధరమ్ సోద్ బాలు శ్రీను సంఘ సభ్యులు కోరే రమేష్ పోతరాజు కరుణాకర్ చీర లింగయ్య కోరే గణేష్ గుండె రవి చెట్టే కుమారస్వామి పోతరాజు ఎర్రయ్య పోతరాజు చిన్నన్న పోతరాజు పెద్ద లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!