మంగళపెల్లి హుస్సేన్ కు గ్లోబల్ ఎక్సలెన్స్ ఫోరం అవార్డు
సామాజిక సేవలకు వరించిన జాతీయ పురస్కారం

నమస్తే భారత్ :-తొర్రూరు
మానవహక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్న తొర్రూరు వాసి మంగళపల్లి హుస్సేన్ కు అరుదైన గౌరవం దక్కింది.ఆయన చేపట్టిన విస్తృత కార్యక్రమాలకు గుర్తింపుగా
ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎక్సలెన్స్ ఫోరం జాతీయ పురస్కారాన్ని ప్రధానం చేసింది.తాజాగా న్యూఢిల్లీలోని లీలా కన్వెన్షన్ హాల్ లో గ్లోబల్ ఎక్సలెన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధాన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది.
ఆయనకు ఫోరం బాధ్యులు జితేందర్ పురస్కారాన్ని ప్రధానం చేశారు.
హుస్సేన్ ప్రస్తుతం
హ్యూమన్ రైట్స్ ఫర్ సోషల్ జస్టిస్ జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఈయన గత కొంతకాలంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పౌర హక్కుల పరిరక్షణ, అబలలు, నిస్సహాయులకు అండగా వందల సంఖ్య లో కార్యక్రమాలు చేపట్టి మన్ననలు పొందారు.ఆయన చేపట్టిన కార్యక్రమాలతో అధికార గణం కదిలి వచ్చి బాధితులకు న్యాయం చేసిన ఘటనలు అనేకం కనిపిస్తాయి. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన గ్లోబల్ ఎక్సలెన్స్ ఫోరం జాతీయస్థాయి పురస్కారాన్ని ప్రధానం చేసి గౌరవించింది.ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను పెంచిందని, తాను చేస్తున్న కార్యక్రమాలకు జాతీయస్థాయి పురస్కారం దక్కడం ఆనందంగా ఉందన్నారు. సేవలను మరింత విస్తృతపరచడానికి, మరిన్ని సేవలు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.
జాతీయ పురస్కారం అందుకున్న హుస్సేన్ కు తొర్రూరు వాసులు అభినందనలు తెలిపారు.



