ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్ఫీజు దోపిడీకి అడ్డుకట్ట వేయాలి: ఏబీవీపీ

ఫీజు దోపిడీకి అడ్డుకట్ట వేయాలి: ఏబీవీపీ

📰 Generate e-Paper Clip

ఫీజు దోపిడీకి అడ్డుకట్ట వేయాలి: ఏబీవీపీ

-ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముట్టడించిన విద్యార్థులు

-తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుతో ఏబీవీపీ ఆందోళన

-రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల విడుదలకు డిమాండ్

-అడ్మిషన్ల సమయంలో విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపొద్దని విజ్ఞప్తి

-నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ కళాశాలలపై చర్యలు కోరిన నాయకులు

-విద్య హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం

-విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

కుత్బుల్లాపూర్, జూన్ 30 ( నమస్తే భరత్ ): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కూకట్‌పల్లి విభాగ్ కన్వీనర్ రేగోడ్ నాగేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న ఫీజు దోపిడీని ప్రభుత్వం కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రావాల్సిన సుమారు రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. డిగ్రీ ప్రవేశాల సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను విస్మరించి విద్యార్థుల నుంచి మొత్తం ఫీజును ముందుగానే చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో జాప్యం కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన, అందుబాటులో ఉన్నత విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఏబీవీపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ఆందోళనలో ఏబీవీపీ రాష్ట్ర, విభాగ, జిల్లా నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!