ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటు కీలకం

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటు కీలకం

📰 Generate e-Paper Clip

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటు కీలకం

కొంపల్లిలో ఎస్ఐఆర్–2026 ప్రత్యేక ఓటరు నమోదు అవగాహన కార్యక్రమంలో కొలన్ హన్మంత్ రెడ్డి పిలుపు

-నంది చౌక్ పార్క్, జయభేరి పార్క్‌లలో అవగాహన కార్యక్రమాలు

-అర్హులంతా ఓటరుగా నమోదు కావాలని సూచన

-ఓటరు జాబితాలో వివరాలు పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకోవాలని విజ్ఞప్తి

-ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు అమూల్యమని వ్యాఖ్య

-ఎస్ఐఆర్–2026 అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు

కొంపల్లి, జులై 20 ( నమస్తే భారత్ ) కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొంపల్లి ప్రాంతంలోని నంది చౌక్ పార్క్ మరియు జయభేరి పార్క్‌లో ఆదివారం నిర్వహించిన ఎస్ఐఆర్–2026 ప్రత్యేక ఓటరు నమోదు అవగాహన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు తమ పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను ఒకసారి పరిశీలించి, అవసరమైతే వెంటనే సవరణలు చేయించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఓటు అత్యంత విలువైనదని పేర్కొన్న హన్మంత్ రెడ్డి, ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్–2026 ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఓటరు నమోదు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆదిరెడ్డి మోహన్ రెడ్డి, డీసీసీ కమిటీ జనరల్ సెక్రటరీ బైరి ప్రశాంత్ గౌడ్, అన్నారం గోపాల్ రెడ్డి, జిల్లా లేబర్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి గోపాల్ రెడ్డి, ఏ-బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేణుక అశోక్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏరోళ్ల కృష్ణ, ఎస్.కె. ఇబ్రహీం, శ్రీనివాస్, నియోజకవర్గంలోని వివిధ డివిజన్‌ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!