ePaper
Thursday, July 16, 2026
ePaper
Homeఎడిటోరియల్నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా, నిద్ర మత్తు వదలని అధికార యంత్రాంగం.

నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా, నిద్ర మత్తు వదలని అధికార యంత్రాంగం.

📰 Generate e-Paper Clip

నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా, నిద్ర మత్తు వదలని అధికార యంత్రాంగం.

కనకదుర్గా స్టీల్స్ పరిశ్రమపై పై చర్యలు తీసుకోవాలి.

పినపాక ప్రభాకర్, రాష్ట్ర కన్వీనర్, కార్మిక సంక్షేమ సంఘం తెలంగాణ

నమస్తే భారత్ షాద్ నగర్ జులై12:షాద్ నగర్ నియోజక వర్గంలో ఉన్న పరిశ్రమలలో నిత్యం అనేక ప్రమాదాలు జరిగి వందలాది మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నా, పరిశ్రమ లలో భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా లంచాల మత్తులో అధికార యంత్రాంగం మునిగి పోయిందని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ ఒక ప్రకటనలో విమర్శించారు.
శనివారం నందిగామ మండలంలోని వీర్లపల్లి గ్రామంలో ఉన్న కనకదుర్గా స్టీల్ పరిశ్రమలో బాధ్యత ప్రమాణాలు లేక పోవడంతోనే బీహార్ కు చెందిన భారత్ కుమార్ మిశ్రా పై బాగా వేడి గా పౌడర్ మీద పడటంతో 75 శాతానికి పైన కాలిపోయాడని, యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది . అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో వేరే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన యాజమాన్యం లాభాలే ధ్యేయంగా ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా పరిశ్రమను నడుపుతున్నారు. ఇప్పటికే అనేక మంది కార్మికులు అక్కడ చనిపోయారని, అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన కార్మికుడి కి నాణ్యమైన వైద్య రందించి ఆదుకోవాలి. ఇప్పటికైనా ఈ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలి. మీకు చేతకాక పోతే మమల్ని తీసుకుపోండి లోపాలను చూపిస్తాం. వెంటనే కనకదుర్గ స్టీల్ పరిశ్రమపై చర్యలు తీసుకుని మీ నిజాయితీని నిరూపించుకోవాలని అధికారులను కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!