ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లతో పాటు ఆయకట్టు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన పోరాటాలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య పిలుపునిచ్చారు అక్టోబర్ 24 న శనివారం రోజున సిపిఎం మరిపెడ మండలం విస్తృత స్థాయి సమావేశం తాడూరు వీరేంకులు అధ్యక్షులు జరిగింది సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పత్తి కింటాకు 12000 ఇవ్వాలని 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందించాలని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు వితంతు వికలాంగుల ఒంటరి మహిళల గీతా నేత పెన్షన్ మంజూరు చేయాలని తానంచర్ల ఆయకట్టు రిపేర్ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు గ్రామాల్లో అంతర్గత రహదారులు సైడ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుపరచాలని ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగు పహారి గోడలు మంచినీరు టాయిలెట్స్ కంప్యూటర్ ల్యాబ్స్ కాళీ పోస్టులు భర్తీ చేసి కనీస సౌకర్యాలు కల్పించాలని అంబేద్కర్ అభయ హస్తం కింద దళిత గిరిజన యువకులకు 12 లక్షలు ఇవ్వాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు
ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ మండల నాయకులు బాణాల రాజన్న జిన్న లచ్చన్న తాడూరు వీరేంకులు నందిపాటి వెంకన్న జింక ఎర్ర ఎంకన్న షేక్ షరీఫ్ నలబోలు లక్ష్మారెడ్డి చేనబోయిన వెంకన్న భూక్యచంద్రు నాయక్ పోలెపాక గణేష్ లాలయ్య ఆ పటాన్ ఇమామ్ సాబ్ బాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు



