ఆంజనేయ స్వామి విగ్రహానికి పంచలోహ కిరీటం సమర్పించిన దంపతులు
ఖానాపురం జులై28( నమస్తే భారత్ ) :
ఖానాపురం మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రముఖ దాత చీదుల మంజుల-బిక్షపతి దంపతులు విలువైన పంచలోహ కిరీటాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా వేద పండితులు శివప్రసాద్ శాస్ర్తీ మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచలోహ కిరీటాన్ని అలంకరించారు. కిరీట సమర్పణ అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక హారతులు సమర్పించారు.
పంచలోహ కిరీటం బహుకరించిన మంజుల బిక్షపతి లకు సర్పంచ్ వినోద్ కుమార్ గ్రామ ప్రజలందరి తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాటోత్ వినోద్ కుమార్ , పూజారి శివకుమార్ శాస్త్రి , పోతరాజు సదయ్య , రెడ్డి మల్ల శృతి రాకేష్ , జాటోత్ రాజ్ కుమార్, బక్కి శ్రావణ్, వల్లె నరేందర్, కందిక యాకయ్య తదితరులు పాల్గొన్నారు.



