ఆంజనేయ స్వామి విగ్రహానికి పంచలోహ కిరీటం సమర్పించిన దంపతులు
ఆంజనేయ స్వామి విగ్రహానికి పంచలోహ కిరీటం సమర్పించిన దంపతులు ఖానాపురం జులై28( నమస్తే భారత్ ) : ఖానాపురం మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రముఖ దాత చీదుల మంజుల-బిక్షపతి దంపతులు విలువైన పంచలోహ కిరీటాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు శివప్రసాద్ శాస్ర్తీ మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచలోహ కిరీటాన్ని అలంకరించారు. కిరీట సమర్పణ అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక హారతులు సమర్పించారు. పంచలోహ...