ePaper
Friday, September 25, 2026
ePaper
Homeఎడిటోరియల్గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్

గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్

📰 Generate e-Paper Clip

గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 4వ వార్డు పరిధిలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ కంచర్ల నరేష్ రెడ్డితో కలిసి పాఠశాలను పరిశీలించిన ఆమె, పాఠశాలలోని పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాల రికార్డులు, వంటశాల, వంట సామగ్రి, స్టాక్ వివరాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మెరుగు రాము, పానుగోతు రాములు, కో-ఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్న, 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ యాకుబ్ పాషా, బయ్య లింగన్న, పాఠశాల హెడ్‌మాస్టర్ లాలు, వార్డెన్ రమేష్, కృష్ణ, మోతిలాల్, జయలక్ష్మి, వార్డు ఆఫీసర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!