ePaper
Thursday, July 16, 2026
ePaper
Homeఎడిటోరియల్అనుచిత వాక్యాలు చేసిన కాంగ్రెస్ యూత్ రాష్ట్ర అధ్యక్షులు  శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలను...

అనుచిత వాక్యాలు చేసిన కాంగ్రెస్ యూత్ రాష్ట్ర అధ్యక్షులు  శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలను అరెస్ట్ చేయాలి

📰 Generate e-Paper Clip

అనుచిత వాక్యాలు చేసిన కాంగ్రెస్ యూత్ రాష్ట్ర అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలను అరెస్ట్ చేయాలి

 

 

మహబూబాబాద్ జూలై14 (నమస్తే భారత్ ) :

 

గౌడ సమాజం పైన, యాదవ మహిళా మీద బూతులు తిడుతూ, అనుచిత వాక్యాలు చేసిన కాంగ్రెస్ యూత్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి లను సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని

మహాత్మా జోతి బా పూలె నేషనల్ అవార్డు గ్రహీత,

మోకు దెబ్బ జిల్లా అధ్యక్షులు, బీసీ ఎస్ స్సీ ఎస్ టీ జెఏసీ రాష్ట్ర కో అర్డినేటర్ ,బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కోర్టు వద్ధ గౌడ సంఘాలు, యాదవ సంఘాలు, బహుజన రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ముంజాల రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ

గౌడ సమాజం పైన, యాదవ మహిళ ఈశ్వరమ్మ పైన ఎల్ బీ నగర్ నియోజకవర్గం, మన్సురాబాద్ కు చెందిన జక్కిడి శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి లు

గౌడ సమాజం పైన బూతులు తిడుతూ మీరు నమ్మకద్రోహులు అని గౌడ కులాన్ని అవమాన పరచిన, ఆత్మభిమానం దెబ్బ తినే విధంగా మాట్లాడం సరికాదన్నారు. అదేవిధంగా యాదగిరిగుట్ట దేవాలయ బోర్డు సభ్యురాలిగా గా ఉన్న పోచబోయినా ఈశ్వరమ్మ ఆమె అభిమానులు యాదవులు అందరు కలిసి అక్కడ ఎల్బీనగర్ లో ఫ్లెక్సీలు పెడితే ఆమెను వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించి అనుచిత వాక్యాలు చేస్తూ బూతులు తిడుతూ వాళ్ళ ను బెదిరిపు లకు పాల్పడ్డాడన్నారు. తల్లితో సమానురాలు అలాంటి వ్యక్తులను ఆమెను వయసు కూడా చూడకుండా అనుచిత వాక్యాలు చేసిన శివ చరణ్ రెడ్డిని ప్రభాకర్ రెడ్డి ని శిక్షించాలి, క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలన్నారు. యూత్ కాంగ్రెస్ పార్టీ , అధ్యక్ష పదవీనుడి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.బీసీలు తెలంగాణలో 65% ఉన్నాం దీంట్లో యాదవ సంబందించిన గౌడ సామాజిక వర్గమైన మేము అగ్రబాగాన వున్నాము,ఏ పార్టీకైనా మీము లేనిదే తెలంగాణలో పుట్టగతులు ఉండవు అని అన్నారు. అగ్రకులకు అహంకారపు మాటలు మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి శివ చరణ్ రెడ్డి గౌడసమాజనికి,యాదవులకు,ఈశ్వరమ్మ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. బీసీ వర్గాలు ఏదైనా కూడా కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మేము జెండాలు ఏ విధంగా మోసమో మిమ్ములను ఆ విధంగానే కూల్చగలమణి హెచ్చరిస్తూ ఏదేమైనా కూడా మీ కాంచి మేము రాజ్యం గుంజుకొని రాజ్యధికారం లోకి వొస్తామని

తమిళనాడు తరువాలో మార్పు వొస్తుందని గుర్తు చేస్తూ మా యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మేము ఊరుకోమని హెచ్చరించారు. ఈకార్యక్రమం లో తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు జెరిపోతుల వెంకన్న గౌడ్ , యాదవ జిల్లా నాయకులు చిత్తరి సోమన్న, యాదవ్, మోకు దెబ్బ రాష్ట్ర కార్యదర్శి గడ్డం అగర్వాల్ గౌడ్ ,యాదవ్ సంఘం జిల్లా కార్యదర్శి మల్లయ్య యాదవ్,తెలంగాణ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకన్న గౌడ్, బహుజన రాజ్యాధికార సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గండి వీరేందర్ గౌడ్ గౌడ సంఘం నాయకులు లింగాల విరభద్రం గౌడ్, గండి మధు గౌడ్, గండి రాజేష్ గౌడ్ , గాడిపెల్లి అనిల్ గౌడ్ , ఉమాగాణి మధు గౌడ్ , అమ్మటి వెంకట్ గౌడ్ గాడిపెల్లి యాదగిరి గౌడ్, కుమార్ యాదవ్, బీసీ సంఘ, కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!