ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeఎడిటోరియల్ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు  నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు  నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

📰 Generate e-Paper Clip

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

కుత్బుల్లాపూర్‌లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు
ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకుడిగా ప్రశంసలు
కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు
పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
కుత్బుల్లాపూర్, జూన్ 19 ( నమస్తే భారత్ ); రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణతో పాటు దేశ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ముత్యం రెడ్డి, బుయ్యని శివకుమార్, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!