నర్వ మండల కేద్రానికి నవోదయ పాఠశాల విషయంలో డీకే.అరుణమ్మ గారు రాజకీయం చేస్తుందనడం మంత్రి గారి చేతగాని తనానికి నిదర్శనం-బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి,
నమస్తే భరత్,,19/8/2026/ నారాయణపేట జిల్లా
నర్వ మండల కేంద్రంలో నిన్న జరిగిన మంత్రి గారి పర్యటనలో భాగంగా ప్రాథమిక వ్యవసాయ క్షేత్రంలో మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు మాట్లాడుతూ నేను బీజేపీ పెద్దలను కలిసి నర్వ మండల కేంద్రానికి నవోదయ పాఠశాలను మంజూరు చేయాలనీ కోరితే, పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారు అడ్డుపడుతున్నారు అని మాట్లాడటం మంత్రి గారి చేతగాని తనానికి, అపరిపక్వ రాజకీయ పరిణతికి అద్దం పడుతుందని బీజేపీ నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు మండి పడ్డారు.
మంత్రిగారు మీరు నవోదయ పాఠశాల గురించి ఏ బీజేపీ నాయకులతో మాట్లాడితే అరుణమ్మ గారు అడ్డుపడ్డదో వివరాలు తెలుపగలవా,
ఒకవేళ అరుణమ్మ గారు అడ్డుపడినట్లు ఆధారాలు చుపివ్వగలవా,
నర్వ మండల ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించకు మంత్రి గారు.
కేంద్రప్రభుత్వ నిధులతో మంజూరైన పనులను అరుణమ్మగారికి ఏమాత్రం ముందస్తు సమాచారం ఇవ్వకుండా భూమి పూజలు చేసే మీరా అరుణమ్మ గురించి మాట్లాడేది.
దివంగత శ్రీ చిట్టెం నర్సిరెడ్డి గారి దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చిన మీరు, మక్తల్ సర్పంచ్ గా, జడ్పీటీసీగా చిట్టెం కుటుంబ సభ్యులు మరియు అరుణమ్మ గారి ఆశీస్సులతో గెలిచి గొప్పలు చెప్పుకొన్న శ్రీహరి గారు, భీమా ప్రాజెక్టు ద్వారా మక్తల్ నియోజక వర్గానికి సాగునీటిని అందించి, కాంగ్రెస్ పార్టీ MLA గా ఉండి, మావోయిస్టుల తూటాలకు ప్రాణాలొదిలిన స్వర్గీయ శ్రీ చిట్టెం నర్సిరెడ్డి గారి జయంతి, వర్ధంతి సందర్భముగా కనీసం తన విగ్రహానికి ఒక పూలమాల వేయని మీరు నర్సిరెడ్డి గారి కూతురు, మహబూబ్నగర్ ఎంపి అరుణమ్మ గారు నాకు అడ్డుపడుతుందని మాట్లాడటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.
నర్వ సింగిల్ విండొని ప్రక్షాళన చేస్తా, రైతులకు న్యాయం చేస్తా అని మీ ఎన్నికల ముందు వాగ్దానం చేసి,
MLA గా గెలిచిన తరువాత మొట్టమొదటి జనరల్ బాడీ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్తో మాట్లాడినా, 15 రోజులల్లో లెక్కలన్నీ బయట పెడ్తా అన్న మీరు, MLA గా రెండు సంవత్సరాలు, మంత్రిగా అయి ఒక సంవత్సరం గడుస్తున్నా ఈరోజు వరకు సింగిల్ విండో గురించి పట్టించుకోని శ్రీహరి గారు, మీరా నర్వ PACS ని రోల్ మాడల్ గా తీర్చి దిద్దేది.
మీరు నిజంగా సమావేశాల్లో మాట్లాడాల్సింది మీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడు,
ఇవిగో మేము ఇచ్చిన మాట నెరవేర్చినం అని
1. భార్య, భర్తలకు 4 వేల రూపాయల పింఛన్లు ఇచ్చినం
2. రైతులకు 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేసినం
3. కల్యాణలక్ష్మి కింద తొలం బంగారం ఇచ్చినం
4. డిగ్రీ చదివిన అమ్మాయిలకు స్కూటీలిచ్చినం
5. రైతు భరోసాకింద ఎకరాకు 15,000/- రూపాయలిచ్చినం,కౌలు రైతులకు ఎకరాకు 12,000/- రూపాయలు ఇచ్చినం
6. నిరుపేదలకు 3 ఎకరాల భూమి ఇచ్చినం
7. నర్వ మండల కేంద్రానికి ఇంటెర్మీడియేట్ కళాశాల తెచ్చినం
8. నర్వకు 100 పడకల ఆసుపత్రి తెచ్చినం
9. నర్వ నుండి రాంపూర్ గేట్ వరకు డబుల్ రోడ్ ఎపించినం
అని నిరూపించి మాట్లాడండి మంత్రిగారు, అంతేగాని నేను ఏది చెప్తే అది వింటరు అని ఊహల్లో విహరించవద్దు,
గతంలో TRS ని ఓడించాలనే ఒకే ఒక్క కసి తోన మక్తల్ నియోజక వర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన విషయాన్ని గౌరవ మంత్రి గారు గుర్తుపెట్టుకొంటే మీకు మంచిది, మీ పార్టీకి మంచిది.
ఏడుమంది అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యేలని ఎదిరించి మహబూబ్నగర్ గడ్డమీద మొట్టమొదటి మహిళా పార్లమెంట్ సభ్యురాలిగా గెలిచి, ఎన్నడూ లేనంతగా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజక వర్గాన్ని విద్య, వైద్యం, రవాణా, వ్యవసాయం మొదలగు రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తిన్న అరుణమ్మ గారి గురించి తప్పుగా మాట్లాడి, నేను చేస్తున్న అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని చెప్పడం
ఆడ రాక గజ్జల బరువు అన్నట్లుంది.
అరుణమ్మ మీద లేనిపోని నిందలు వేసి కంపమీద రాళ్లు వేసి దాటి పోవాలని ప్రయత్నించే మంత్రి గారు ఒక్కసారి ఆలోచించండి,
మున్సిపల్ ఎన్నికలముందు ఆత్మకూర్, అమరచింత మున్సిపాలిటీలలో ఒక్కో మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయల భూమి పూజలు, శంకుస్థాపనలు ఆర్భాటంగా చేస్తిరి, ఎన్నికలై 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎన్ని రోడ్లు ఎపించిండ్రు, ఎన్ని కాలువలు కట్టిండ్రు ఎన్ని వీధి దీపాలు ఏసిండ్రు, ఎన్ని కోట్ల రూపాయల పనులు పూర్తి చేసిండ్రు వాటి గురించి మాట్లాడండి.
మక్తల్ – నారాయణపేట రోడ్ ప్రయాణీకులకు నరకయాతన కనిపిస్తున్నది, అదేవిదంగా నియోజకవర్గంలోని చాలాగ్రామాల రోడ్ల పరిస్థితి ఇదే విదంగా వుంది,వాటి పైన ద్రుష్టి పెట్టి బాగుచేయాలని, ఒక క్యాబినెట్ మినిష్టర్ గా హుందా తనంతో ముందుకు వెళ్లాలని భవిస్తూ,
బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర నాయకులు.
మక్తల్ నియోజకవర్గం.



