గీతా విద్యాలయంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
గీతా విద్యాలయంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ప్రిన్సిపాల్ పోలోజు నరసింహాచారి చండూరు, నమస్తే భారత్ నవంబర్ 14: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శనివారం చండూరులోని గీతా విద్యాలయం (E/M) పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేస్తూ నెహ్రూ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ పోలోజు నరసింహాచారి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,...