ePaper
Sunday, October 11, 2026
ePaper
Homeఎడిటోరియల్సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన సీతారాంపురం...

సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన సీతారాంపురం విద్యార్థినులు

📰 Generate e-Paper Clip

సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన సీతారాంపురం విద్యార్థినులు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సీతారాంపురంలో బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుగులోత్ అర్జున్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని విద్యార్థినులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థినులు బతుకమ్మ పాటలు పాడుతూ, సంప్రదాయ ఆటపాటలతో సందడి చేశారు. పూల పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించడంతో పాటు, మన పండుగలు,ఆచారాల పట్ల అవగాహన కల్పించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పాఠశాలలో నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థినుల్లో ఆనందోత్సాహాలను నింపాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గుగులోత్ మంగీలాల్, లింగాల మహేష్ గౌడ్, వెంకటేశ్వరరావు,సందీప్,కవితఆదిలక్ష్మి,సారిక,విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!