ePaper
Friday, September 11, 2026
ePaper
Homeతెలంగాణ*ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిపిటి &టి డి వ్యాక్సినేషన్ పై అవగాహన కార్యక్రమం*

*ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిపిటి &టి డి వ్యాక్సినేషన్ పై అవగాహన కార్యక్రమం*

📰 Generate e-Paper Clip

*ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిపిటి &టి డి వ్యాక్సినేషన్ పై అవగాహన కార్యక్రమం*

*డాక్టర్ ముస్తాకిన్ వైద్య అధికారి*

*జె.శ్రీనివాసులు హెల్త్ ఎడ్యుకేటర్*

నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్11: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు ఏరియాలోని , షాద్ నగర్ లో సబ్ సెంటర్ “సి” ఏరియా శ్రీనివాస కాలనీ లో ఎం ఎల్ హెచ్ పి వైద్యాధికారి డాక్టర్ ముస్తాకిన్ అహ్మద్ ఆధ్వర్యంలో, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో, డి.పి.టి మరియు టి.డి వ్యాక్సిన్ లపై హెల్త్ ఎడ్యుకేటర్ జె .శ్రీనివాసులు విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించి , వ్యాక్సినేషన్ ఇప్పించారు. డిఫ్తీరియా ర్టుసిస్ (కోరింత దగ్గు) , టెటనస్ అంటారు అని, *డిఫ్తీరియా* వలన ప్రధానంగా గొంతు మరియు శాసనాళాలను ప్రభావితం చేసే తీవ్రమైన అంటూ వ్యాధి అని, *పర్టు సిస్ (కోరింత దగ్గు)* వలన చిన్నపిల్లల్లో తీవ్రమైన దీర్ఘకాలిక దగ్గు వస్తుంది అని, *టెటనస్* అనేది ముఖ్యంగా గాయాల ద్వారా, శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా వల్ల వచ్చే తీవ్రమైన వ్యాధి అని, ఇది కండరాలు బిగుసుకుపోవడం, దవడ కదలక పోవడం, తీవ్రమైన కండరాల సంకోచాలు వంటి సమస్యలకు దారి తీయవచ్చు అని హెల్త్ ఎడ్యుకేటెర్ జె శ్రీనివాసులు విద్యార్థులకు తెలియజేశారు.*డి పి టి మరియు *టి డి* టీకాలు తీసుకోవడం వలన పైన తెలిపిన మూడు వ్యాధులను నివా నివారించవచ్చునని తెలియజేశారు. ఈ టీకా వేసిన ప్రదేశంలో కొద్దిగా నొప్పి, వాపు, ఎర్రబడటం, స్వల్ప జ్వరం రావడం జరుగుతుందని, దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, జ్వరము వస్తే ఒక పారాసిటమాలు మాత్రం వేసుకుంటే సరిపోతుందని హెల్త్ ఎడ్యుకేటెర్ జె శ్రీనివాసులు తెలియజేశారు. టెటనస్ వ్యాధి ఒక్కసారి వచ్చిన తర్వాత చికిత్స కష్టతరం కావచ్చు అని, అందువలన వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, ముందుగానే టీకా తీసుకుని రక్షణ పొందడం ఉత్తమమని చెప్పారు. ఐదు సంవత్సరాల వయసు గలవారికి 10 మంది విద్యార్థులకు డి పి టి టీకా వేశాము అని, 10 సంవత్సరముల వయసు గలవారికి 16 మంది విద్యార్థులకు టీ.డీ టీకా వేశామని జె.శ్రీనివాసులు తెలియజేశారు.
టీకా అనేది కేవలము ఒక ఇంజక్షన్ కాదు- మన ఆరోగ్యానికి రక్షణ కవచం హెల్త్ ఎడ్యుకేటెర్ జె శ్రీనివాసులు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్ ఎల్ హెచ్ పి వైద్య అధికారి డాక్టర్ ముస్తకిన్ అహ్మద్, హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ రజిత, ఉపాధ్యాయులు లక్ష్మీ దేవమ్మ , వనజ , ధనలక్ష్మి, మాధవచారి మరియు ఏఎన్ఎంలు రమాదేవి, కవిత, ఆశాలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!