ePaper
Sunday, July 5, 2026
ePaper
Homeఎడిటోరియల్మానుకోటలో ఘనంగా అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు

మానుకోటలో ఘనంగా అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

మానుకోటలో ఘనంగా అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు

నమస్తే భారత్ :-మరిపెడ

మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని నేతాజీ సేవాసమితి ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నేతాజీ సేవాసమితి వ్యవస్థాపకుడు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, అల్లూరి.బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచి గిరిజనుల హక్కులు, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. సీతారామరాజు గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ,నేటి యువత అల్లూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశభక్తి, క్రమశిక్షణ, ధైర్యసాహసాలు అలవర్చుకోవడంతో పాటు తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవభావాన్ని.పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు రావాలని, యువత సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అల్లూరి త్యాగం, పోరాట స్ఫూర్తి భావితరాలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నేతాజీ సేవాసమితి ప్రధాన కార్యదర్శి కుదురుపాక వివేక్, ఆర్గనైజింగ్ కన్వీనర్ సామ శ్రీనివాస్, సభ్యులు చిట్టిమల్ల రఘు, శ్రీరంగం శోభన్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిజు పీటర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!