Aikms జాతీయ 4వ మహాసభలు జయప్రదం కోరుతూ విచిత్ర వేషధారణ,వినూత్న ప్రదర్శన,ప్రచారం
నమస్తే భారత్ :-తిరుమలాయపాలెం
తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామంలో వినూత్నంగా ఎడ్ల కోడేరులతో అఖిలభారత రైతుకూలి సంఘం సభలను జయప్రదం చేయాలని గ్రామంలో ప్రదర్శన తీస్తున్న దృశ్యాలు కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మాజీ రాష్ట్ర నాయకులు మందుల రాజేంద్రప్రసాద్ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు, సమాన పనికి సమాన వేతనం, రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, డిమాండ్ చేస్తూ సోమవారం ఖమ్మంలో జరిగే భారీ బహిరంగను ప్రజలు రైతులు కూలీలు జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో అఖిల భారత రైతు కూలీ సంఘం Aikms మండల అధ్యక్ష కార్యదర్శులు గొర్రెపాటి వీరస్వామి,అచ్చ ఉప్పలయ్య నాయకులు పోలేపొంగు నాగయ్య, వెంకటేశ్వర్లు,బ్రహ్మచారి, పట్టాభి, వీరన్న,ఎల్లయ్య ఐలన్న తదితరులు పాల్గొన్నారు.



