ePaper
Monday, November 16, 2026
ePaper
Homeతెలంగాణరహదారులపై ధాన్యం ఆరబెడితేచర్యలుతప్పవు!

రహదారులపై ధాన్యం ఆరబెడితేచర్యలుతప్పవు!

📰 Generate e-Paper Clip

*రహదారులపై ధాన్యం ఆరబెడితేచర్యలుతప్పవు!*

*ప్రమాదాలకుకారణంకావొద్దు..రైతులకుపాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక*

పాపన్నపేట , నవంబర్ 14 (నమస్తే భారత్)

రహదారులపై ధాన్యం ఆరబెట్టి వాహనదారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ రైతులకు సూచించారు. రహదారులు వాహనాల రాకపోకల కోసమేనని, ధాన్యం ఆరబెట్టేందుకు కాదని స్పష్టం చేశారు. రహదారులపై ధాన్యం ఆరబెట్టి ప్రమాదాలకు కారణమైతే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.శనివారం యూసుఫ్‌పేటవద్దరహదారిపై ధాన్యం ఆరబెడుతున్న రైతులకు ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు. రహదారులపై ధాన్యం కుప్పలు పోయడం, ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయంకలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారిపై ఆరబెట్టిన ధాన్యం వాహనదారులకు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు ధాన్యంపై ప్రయాణించే క్రమంలో అదుపుతప్పి కిందపడితే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
పంటను కాపాడుకునే క్రమంలో ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని రైతులకు హితవు పలికారు. రహదారులకు దూరంగా పొలాల్లో లేదా ఇతర అనువైన ప్రదేశాల్లోనే ధాన్యం ఆరబెట్టుకోవాలని సూచించారు.రహదారులపై ధాన్యంఆరబెట్టిప్రమాదాలకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ హేచ్చరించారు. రైతులు పోలీసుల సూచనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలనివారణకుసహకరించాలని ఆయన కోరారు.ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగావ్యవహరించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!