ePaper
Wednesday, November 11, 2026
ePaper
Homeఎడిటోరియల్చికిత్స పొందుతూ వ్యక్తి మృతి... మెదక్ జిల్లా, పాపన్నపేట మండల్, నవంబర్ 11 (నమస్తే భారత్)

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి… మెదక్ జిల్లా, పాపన్నపేట మండల్, నవంబర్ 11 (నమస్తే భారత్)

📰 Generate e-Paper Clip

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి… మెదక్ జిల్లా, పాపన్నపేట మండల్, నవంబర్ 11 (నమస్తే భారత్)

రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సీతానగర్ గ్రామంలో చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా….సీతానగర్ కి చెందిన మన్నె సత్తయ్య(54) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.కాగా గర్భవతిగా ఉన్న తన కూతురు అశ్వినీని హాస్పిటల్ లో చెకప్ కోసం ఈనెల 9న తన బైక్ పై ఎక్కించుకొని మెదక్ వెళ్లారు.తిరిగి సీతానగర్ కు వస్తుండగా యూసుఫ్ పేట గ్రామ శివారులో కోయ్య గుండు వద్దకు రాగానే ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు వీరి బైక్ ను ఢీ కొట్టడంతో ఇద్దరు కింద పడగా సత్తయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.అశ్వినికి సైతం స్వల్ప గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం ఇద్దరిని అంబులెన్సులో మెదక్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి సమయంలో మృతి చెందాడు.మృతుడి కూతురు అశ్వినీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!