ePaper
Monday, August 3, 2026
ePaper
Homeఎడిటోరియల్తల్లి పాలతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు

తల్లి పాలతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు

📰 Generate e-Paper Clip

తల్లి పాలతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు

సర్పంచ్ గుగులోతు.సుజాత వాసు

నమస్తే భారత్ :-నెల్లికుదురు

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు కేంద్రంలోని తొర్రూర్ ప్రాజెక్టు మేచరాజుపల్లి సెక్టర్ సౌల్ల తండా ఆంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు స్థానిక సర్పంచ్ గుగులోతు.సుజాత వాసు తో కలిసి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డ పుట్టిన మొదటి గంటలోపు ఇచ్చే పసుపు రంగు ముర్రుపాలు ఎంతో పవిత్రమైనవని తెలిపారు. ఇవి శిశువులో రోగనిరోధక శక్తిని పెంచి భవిష్యత్తులో డయేరియా, న్యుమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా రక్షణ కవచంలా కాపాడతాయని వివరించారు. ఆరు నెలల వరకు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అని పేరు పెట్టారు తేనె, నీరు పట్టించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.తల్లులు ఎలాంటి మూఢనమ్మకాలను నమ్మకుండా ముర్రుపాలను బిడ్డకు పట్టించాలని కోరారు. ఆరు నెలల తర్వాత అదనపు పౌష్టికాహారంతో పాటు, కనీసం రెండేళ్ల వరకు తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లల మేధోశక్తి, శారీరక ఎదుగుదల అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి.టీచర్స్ కె . పద్మ.పి.ఉమారాణి.డి కవిత.బి . సుగుణ.ఆశా కార్యకర్త లలిత, గర్భిణీ స్త్రీలు, బాలింతలు. ఆయాలు.బాలింతలు.తల్లులు. వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!