జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో రాష్ర్ట స్థాయిలో ఉచిత ప్రయాణం కల్పించాలి
ఆర్టీసీ ఆర్ ఎం కు టీడబ్ల్యూజేఎఫ్ వినతి
వరంగల్ జూలై10 (నమస్తే భారత్ ) :
జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ )వరంగల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు.ఈసందర్భంగాటీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్ ,స్వామిదాస్ ,జాతీయ కౌన్సిల్ సభ్యులు బుడిగె మల్లేష్ మాట్లాడుతూ గతం మాదిరిగా 1/3 చార్జెస్ లేకుండా పూర్తి ఉచితంగా జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని ఈమేరకు రాష్ర్ట కమిటి పిలుపు మేరకు ఆర్టీసి అధికారులకు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ సంస్థకు కూడా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ చాలా ఏళ్ళుగా జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో 1/3 రాయితీ పై ప్రయాణ సదుపాయం అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత కొంతకాలంగా 1/3 చార్జీలు అంటూనే దాదాపు 50% చార్జీలు వసూలు చేస్తున్నారు. దీనివల్ల జర్నలిస్టులకు భారమవుతుందన్నారు.ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులకు ఈ 1/3 చార్జీలు భరించలేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అనేక మంది జర్నలిస్టులు సరైన వేతనాలు లేకపోయినప్పటికి జర్నలిజం వృత్తిలో కొనసాగుతూ ప్రభుత్వానికి, ప్రజలకు, ఆర్టీసీ సంస్థకు సేవలందిస్తున్నారు. అటువంటి జర్నలిస్టులు వార్తల సేకరణకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాల్సి రావడం వల్ల వారిపై ప్రయాణ చార్జీల భారం పడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ…మా కొద్దిమంది జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకపోవడం బాధాకరం.
జర్నలిస్టులకు అన్ని అర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని, అదేవిధంగా ఇతరరాష్ట్రాలకు వెళ్ళే జర్నలిస్టులకు అక్కడ ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత సదుపాయం కల్పించాలని కోరారు. ఈకార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్ , ప్రధాన కార్యదర్శి బొట్ల స్వామిదాస్ , జాతీయ కౌన్సిల్ సభ్యులు బుడిగె మల్లేష్ , రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆడుప నర్సింగరావు , డాక్టర్ పాలడుగుల సురేందర్, ఉపాధ్యక్షుడు వెల్ది రాజేందర్ , సహాయ కార్యదర్శి రాంపల్లి శ్రీనివాస్ , కమిటీ సభ్యులు పందేల శ్రీనివాస్ , ఆకుల అశోక్ , నాడెం యుగందర్ , ఉప్పు వెంకటేశ్వర్లు, గణిపాకా అనిల్ తదితరులు పాల్గోన్నారు.



