మరిపెడ మైనార్టీ కాలనీలో ఎస్‌ఐఆర్ ఫారాలు నింపడంలో ప్రజలకు అండగా నిలిచిన యువకులు
నమస్తే భారత్ :-మరిపెడ
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరిపెడ పట్టణ కేంద్రంలోని మైనార్టీ కాలనీవాసులు ఆదర్శంగా నిలుస్తున్నారు.ప్రైవేట్ టీచర్ మోమిన్ సార్, బ్యాంకు సలీం,మహమ్మద్ ముక్తార్,డాక్టర్ పాషా తదితరులు కలిసి కాలనీలో ఒకేచోట కూర్చొని ప్రజలకు ఎస్‌ఐఆర్ ఫారాలు ఉచితంగా నింపి అందజేస్తున్నారు.ఫారాల నింపే విధానం, అవసరమైన వివరాలు,జత చేయాల్సిన పత్రాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి ఓర్పుతో.సహాయం.చేస్తున్నారు.వృద్ధులు, మహిళలు, చదువు తెలియని వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న వీరి కార్యక్రమానికి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్రజా సేవే లక్ష్యంగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తున్న ఈ నలుగురు యువకుల మంచితనం అభినందనీయమని కాలనీవాసులు.పేర్కొన్నారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు అండగా నిలుస్తూ సామాజిక బాధ్యతను చాటుతున్న మోమిన్ సార్,బ్యాంకు సలీం,మహమ్మద్ ముక్తార్,డాక్టర్ పాషా తదితరుల సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.



