మరిపెడ మండలం మహిళ సమైక్య కు కూత వేట దూరంలో ఉన్న ఏ పీ ఎం నిర్లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మూత
సిపిఐ మరిపెడ మండలం కార్యదర్శి మారగాని బాలకృష్ణ
నమస్తే భారత్:-మరిపెడ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాష్ట్రంలో ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మహిళ లు అభివృద్ధి సాధించడం కోసం మహిళా సమైక్య ద్వారా రాష్ట్రంలో మహిళా సంఘాల గ్రూపుల ద్వారా బ్యాంకు లింకేజీల ద్వారా వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ సంకల్పాన్ని అధికారుల నిర్లక్ష్యంతో మరుగున పడుతుంది.మరిపెడ మండల కేంద్రంలో మండల సమైక్యత ద్వారా మంజూరైన ఇందిరా మహిళా శక్తి కాంటీన్ మరిపెడ మండల సమైక్య ఏ పీ ఎం నిర్లక్ష్యం తో మూతపడింది దీనిని తక్షణమే తెరిపించి మరిపెడ మండలం ప్రజలకి అందుబాటులోకి తేవాలని సిపిఐ మరిపెడ మండలం సమితి అధికారులకు ప్రజాప్రతినిధులకు డిమాండ్ చేస్తున్నాము లేనిపక్షంలో అధికారులపై ప్రభుత్వం పై పోరాటాలు చేస్తామని తెలియజేశారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకన్న లింగయ్య రాములు లచ్చు తదితరులు పాల్గొన్నారు



