ePaper
Tuesday, July 7, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎస్‌ఐఆర్ ఫారాల నింపడంలో ప్రజలకు అండగా కాంగ్రెస్ నాయకులు

ఎస్‌ఐఆర్ ఫారాల నింపడంలో ప్రజలకు అండగా కాంగ్రెస్ నాయకులు

📰 Generate e-Paper Clip

ఎస్‌ఐఆర్ ఫారాల నింపడంలో ప్రజలకు అండగా కాంగ్రెస్ నాయకులు

నమస్తే భారత్ :-మరిపెడ

తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్‌ఐఆర్ ప్రారంభం కావడంతో ఫారాలను ఎలా నింపాలో అవగాహన లేక పలువురు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు సహాయం అందిస్తూ ఎస్‌ఐఆర్ ఫారాలను నింపిస్తున్నారు.మరిపెడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తాజుద్దీన్,4వ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము, బి ఎల్ ఎ బయ్య లింగయ్య, అనంతగిరి రవి మైనార్టీ నాయకుడు యాకూబ్ పాషా, ఆధ్వర్యంలో ప్రజలకు ఫారాలను సక్రమంగా నింపించి అందజేస్తున్నారు. ఎలాంటి కొట్టివేతలు,తప్పులు లేకుండా స్పష్టంగా ఫారాలను పూర్తి చేసి సంబంధిత బీఎల్‌వోలకు సమర్పించాలని వారు ప్రజలకు సూచించారు.అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ వివరాలను సరిచూసుకుని గడువులోపు ఎస్‌ఐఆర్ ఫారాలను సమర్పించాలని నాయకులు కోరారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!