ePaper
Monday, July 6, 2026
ePaper
Homeఎడిటోరియల్మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

📰 Generate e-Paper Clip

మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

నర్సంపేట, జూలై 5 (నమస్తే భారత్ ) :

వరంగల్ జిల్లా నర్సంపేటలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజీని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కళాశాలలో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, భోజన నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు.ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టల్లో వంట సామాగ్రి నిల్వలు మరియు వంటగది శుభ్రంగా ఉండేలా చూడాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.
పిల్లలకు లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయుటలో 3 రోజులు మూడు భాషలను అనగా తెలుగు,హిందీ ,ఇంగ్లీష్ భాషలను ఉపయోగించేలా చూడాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.విద్యార్థులు నాణ్యమైన విద్యా, ఆహారం పరిసరాల పరిశుభ్రత తదితర 5 అంశాల పై కమిటీలు వేయాలని, ఈ కమిటీలలో ఇద్దరిద్దరూ విద్యార్థినులను ఉండేలా మెంబర్లుగా చేర్చి పర్యవేక్షణ చేయుటకు పిల్లల కమిటి వేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.అలాగే ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ తనిఖి లో డిబిసిడిఓ పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!