ePaper
Thursday, July 2, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రజల విశ్వాసమే పెద్ద పురస్కారం.. జీడిమెట్లలో ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ సేవలకు ప్రశంసల జల్లు

ప్రజల విశ్వాసమే పెద్ద పురస్కారం.. జీడిమెట్లలో ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ సేవలకు ప్రశంసల జల్లు

📰 Generate e-Paper Clip

ప్రజల విశ్వాసమే పెద్ద పురస్కారం.. జీడిమెట్లలో ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ సేవలకు ప్రశంసల జల్లు

-రెండేళ్లుగా సమర్థవంతమైన పోలీసింగ్‌తో ప్రజల మన్ననలు

-నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో విశేష కృషి

-బాధితులకు భరోసా.. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్

-ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందనతో ప్రత్యేక గుర్తింపు

-ప్రజల సహకారమే నా విజయానికి బలం: ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్

-సేవాభావంతో పోలీసు శాఖకు గౌరవం తీసుకొచ్చిన అధికారి

కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): ప్రజలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా, చట్ట పరిరక్షణే కర్తవ్యంగా భావించి రెండేళ్లుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ ప్రజల విశ్వాసాన్ని పొందారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, బాధితులకు తక్షణ న్యాయం, మానవీయ పోలీసింగ్‌తో ఆయన ప్రజలకు మరింత చేరువయ్యారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిన గడ్డం మల్లేష్, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలను ముందుగానే అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మహిళలు, వృద్ధులు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు వెంటనే సహాయం అందిస్తూ పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా నిరంతరం కృషి చేశారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని, ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించడం ద్వారా సమర్థ అధికారిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
ప్రజల భద్రత, సంక్షేమం, న్యాయ పరిరక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమనే భావనతో సేవలందిస్తున్న గడ్డం మల్లేష్, చట్ట అమలుతో పాటు మానవీయ కోణానికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఆయన సేవలను స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు ప్రశంసిస్తున్నారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ, “ప్రజలు నాపై ఉంచిన విశ్వాసం నాకు మరింత బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు. ప్రజల సహకారం లేకుండా సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యం కాదన్నారు. ప్రతి బాధితుడికి న్యాయం అందించేందుకు, ప్రతి పౌరుడు భద్రంగా జీవించేలా శాంతిభద్రతలను కాపాడేందుకు మా బృందం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే నిబద్ధతతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం” అని పేర్కొన్నారు.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్లుగా ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థ నాయకత్వాన్ని ప్రదర్శించిన ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ సేవలు పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు భరోసాగా, బాధితులకు అండగా, న్యాయ పరిరక్షణలో ఆదర్శ అధికారిగా ఆయన కొనసాగాలని స్థానికులు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!