ఘనంగా అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం
వైద్యాధికారుల సన్మానం
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్ ) అంతర్జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ప్రజారోగ్య రక్షణలో నిరంతరం శ్రమిస్తూ, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యాధికారులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.
వైద్య సిబ్బంది, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం:ఆరోగ్య కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న వైద్యాధికారులు డాక్టర్ గుగులోతు రవి మరియు డాక్టర్ కిరణ్ సాగర్లను మరిపెడ వైద్య సిబ్బంది అందరూ కలిసి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా, సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుండే మరిపెడ వాసవి క్లబ్ సభ్యులు సైతం వైద్యాధికారి డాక్టర్ రవి సేవలను కొనియాడుతూ ఆయనను ప్రత్యేకంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు కోవిడ్ సమయం నుండి నేటి వరకు అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యుల పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు.కార్యక్రమంలో పాల్గొన్నవారు:ఈ ఘన సన్మాన కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, హెల్త్ సూపర్వైజర్ లక్ష్మి కుమారి, ఆచార్యులు, స్టాఫ్ నర్సులు పద్మ, సుజాత, రత్న కుమారి పాల్గొన్నారు. అలాగే పల్లె దవాఖాన సిబ్బంది ఝాన్సీ, అఖిల, సరిత, సౌజన్య, అనిత, ఏఎన్ఎం మంజువాణి, ఝాన్సీ, లలిత, నాగమణి, విజయ, కీర్తి, స్వప్న, తులసి, రాములమ్మ, హుస్సేన్ బీ, హరీశ, శ్రీదేవి, శ్రీలత, రోజమణి, మరియు ఆశా కార్యకర్తలు ఆశియా, అనురాధ తదితర వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.



