ePaper
Tuesday, August 11, 2026
ePaper
Homeఎడిటోరియల్వర్షాకాలానికి ముందే సమస్యల పరిష్కారమే లక్ష్యం

వర్షాకాలానికి ముందే సమస్యల పరిష్కారమే లక్ష్యం

📰 Generate e-Paper Clip

వర్షాకాలానికి ముందే సమస్యల పరిష్కారమే లక్ష్యం

జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్డులో రేన్‌వాటర్ లైన్ పనుల పరిశీలన

సాటిలైట్ టౌన్‌షిప్ వాసుల సమస్యలపై ఆరా

రుక్మిణి ఎస్టేట్స్‌లో కమిటీ హాల్ నిర్మాణ పనుల తనిఖీ

మంజీరా నీటి సమస్యతో పాటు కాలనీ సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు

పేట్ బషీరాబాద్, జూన్ 21 ( నమస్తే భరత్ ):కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పేట్ బషీరాబాద్, కుత్బుల్లాపూర్ డివిజన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి పరిశీలించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు. పేట్ బషీరాబాద్ డివిజన్ పరిధిలోని జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్డులో ఉన్న సాటిలైట్ టౌన్‌షిప్ అపార్ట్‌మెంట్‌ను సందర్శించిన భరత్ సింహ రెడ్డి, అపార్ట్‌మెంట్ వాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ నూతనంగా నిర్మిస్తున్న రేన్‌వాటర్ లైన్ పనులను పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి, అపార్ట్‌మెంట్ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే వర్షాకాలంలో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.


ఈ కార్యక్రమంలో అపార్ట్‌మెంట్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డితో పాటు ప్రవీణ్, సరస్వతి, హన్మంతరావు, మహేష్ రెడ్డి, నేగి, శ్రీనివాస్ రాజు, వినోద్ గౌడ్, జనార్దన్, పాపయ్య దొర తదితరులు పాల్గొన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని రుక్మిణి ఎస్టేట్స్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న కమిటీ హాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి మంజీరా తాగునీటి సరఫరా సమస్యతో పాటు ఇతర స్థానిక సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శేఖర్‌తో పాటు ప్రేమానందం, నర్సింహ, నాగరాజు, ప్రదీప్, అశోక్, వీరబాబు, రాజేష్, రాజేంద్ర, రామచంద్ర, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!