ePaper
Sunday, June 21, 2026
ePaper
Homeఎడిటోరియల్ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

షాపూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

కుత్బుల్లాపూర్, జూన్ 19 ( నమస్తే భరత్ ): కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని షాపూర్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో శుక్రవారం రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, దేశ ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తున్న రాహుల్ గాంధీ భవిష్యత్తులో దేశ ప్రధానమంత్రి పదవిని అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో ఆయన మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రోగులకు పండ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న నాయకులు, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూన రాఘవేంద్ర గౌడ్, చౌడా శ్రీనివాసరావు, నాగిళ్ల శ్రీనివాస్, దుంపనబోయిన శ్రీనివాస్, యాము సాగర్, జిమ్ వేణు, చందు గౌడ్, సుశాంత్, తౌఫిక్, బిల్లా వెంకట్, చోటు, రఘు, ఉలిపి శ్యామ్, వెంకటేష్ యాదవ్, సంపత్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!