ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeఎడిటోరియల్పాలకుల అసమర్థ విధానాల వలనే ధరల పెరుగుదల

పాలకుల అసమర్థ విధానాల వలనే ధరల పెరుగుదల

📰 Generate e-Paper Clip

పాలకుల అసమర్థ విధానాల వలనే ధరల పెరుగుదల

కార్పొరేట్ శక్తులకు దాసోహమై సామాన్యులపై భారం

బి విజయ సారధి సిపిఐ జిల్లా కార్యదర్శి

నమస్తే భారత్ :-మరిపెడ

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు దాసోహమై సామాన్యులపై పెను భారాన్ని మోపుతున్నారని  జిల్లా కార్యదర్శి విజయసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు.సిపిఐ మరిపెడ మండల కౌన్సిల్ సమావేశం మండల కేంద్రంలో జరగగా ముఖ్యఅతిథిగా హాజరైన విజయసారధి మాట్లాడుతూ దళారీగా మారిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు వేలకోట్లు దోచిపెడుతూ,అన్ని రకాల వస్తువుల ధరలు, పెట్రోల్ ఢీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుడిపై మోయలేని భారం వేస్తూ మాటల డితో పాలన సాగించడం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలకు అలవాటుగా మారిందని విమర్శించారు
రేవంత్ ప్రభుత్వం ఎన్నికలలో చెప్పిన ఆసరా పెన్షన్ లను, అర్వులైన వారందరికి ఇందిరమ్మ ఇల్లు, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలిని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం కట్టిన డబుల్  బెడ్ రూమ్ ఇళ్ళు వందలాది పడావు పడ్డాయాని వాటిని వెంటనే అర్వులైన పేదలకు పంచాలని కోరారు ఈ సమావేశం లో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి, మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ, సిపిఐ జిల్లా సమితి సభ్యులు అబ్దుల్ రషీద్, మల్లేపాక యాకన్న, నారాయణ,పి వెంకన్న, వీరన్న, యం వెంకన్న, పి రమేష్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!