మిషన్ భగీరథ కార్మికుల హక్కుల సాధనకు నూతన జిల్లా కమిటీ ఎన్నిక.

-జిల్లా అధ్యక్షుడిగా.
అలువాల కృష్ణ
-జిల్లా ఉపాధ్యక్షుడిగా.
రాయల శ్రీను ఎన్నిక
నమస్తే భారత్ :-మరిపెడ
మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన లక్ష్యంగా సీఐటీయూ అనుబంధ మిషన్ భగీరథ కార్మిక సంఘం నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మెట రాజమౌళి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గ్రామీణ ప్రాంతాలు, వాటర్ ప్లాంట్లలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు సంఘటితమై తమ హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు, కార్మిక సంక్షేమం కోసం యూనియన్‌లో చేరి నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారనీ రాజమౌళి తెలిపారు.ఈ సందర్భంగా అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన అలువాల కృష్ణ జిల్లా అధ్యక్షుడిగా, రాయల శ్రీను జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇతర జిల్లా ఉపాధ్యక్షులుగా కోట శ్రీనివాస్, ధర్మారపు సుధాకర్, పందుల రాజశేఖర్, బి. శ్రీను, మార్కం రమేష్ ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా శానం ఉపేందర్, సహాయ కార్యదర్శులుగా బానోత్ సోమ్లా, జి. వెంకన్న, సంతోష్ వంశీ ఏళ్లబోయిన, అశోక్, లాలు సైదులు ఎన్నికయ్యారు. కోశాధికారిగా చెన్నబోయిన వీరేందర్ బాధ్యతలు చేపట్టగా, గౌరవ సలహాదారులుగా చింతల యాకన్న, చెన్నబోయిన రవి, సోషల్ మీడియా ఇన్‌చార్జీలుగా గంగరబోయిన రఘు, పైండ్ల రాధాకృష్ణ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుతామని తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధ హక్కులు అమలు అయ్యేలా ఉద్యమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని, జిల్లాలోని మిషన్ భగీరథ కార్మికులందరినీ సంఘంలో చేర్చి బలోపేతం చేస్తామని వెల్లడించారు.నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా కార్మికులు నాయకులకు అభినందనలు తెలియజేసి, సంఘాన్ని బలోపేతం చేసేందుకు సహకరిస్తామని తెలిపారు.



