ePaper
Thursday, June 18, 2026
ePaper
Homeఎడిటోరియల్దూస్ కల్ లో ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం..

దూస్ కల్ లో ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం..

📰 Generate e-Paper Clip

దూస్ కల్ లో ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం..

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్17:రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్ నగర్ మండలంలోని దూస్ కల్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో ప్రవేశం పొందిన చిన్నారులకు కొత్త పలకలు, బలపాలు ఇచ్చి సరస్వతీదేవి పూజ చేయించి వారిచేత అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఇందులో విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామసర్పంచ్ జ్యోతిర్మయి అంజయ్య ప్రేరణతో దాదాపు పది మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుండి ప్రా.పా. దూస కల్ లో ప్రవేశం పొందడం జరిగింది. ఆమె ప్రసంగిస్తూ ప్రభుత్వ బడులు కూడా ప్రైవేటుకు ధీటుగా విద్య అందిస్తున్నాయని, ప్రజలంతా ప్రభుత్వబడుల్లో విద్యార్థుల్ని చేర్చి వాటిని బలోపేతం చేయాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతిర్మయి అంజయ్య,
పంచాయతీ కార్యదర్శి ఆశీష్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులురేవతి, సురేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు అన్నపూర్ణ, శైలజ, రెడ్యాలాల్, సతీష్, వెంకటేష్, సంతోష్ బాబు, శ్రీనివాస్, సర్ఫరాజ్ అన్వర్ , తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!