విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను మనం గౌరవించుకోవాలి


70 మంది సైనిక సిబ్బందిని రక్షణ శాస్త్రవేత్తలను సత్కరించిన జీయర్ స్వామి
నమస్తే భారత్ ప్రతినిధి , రాజేంద్రనగర్, నవంబర్ 11, దేశం కోసం పనిచేసిన దేశం కోసం విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను మనం గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని ముచింతలలో గల జీయర్ ఆశ్రమంలో జరుగుతున్న యతేంద్రి సప్తతి నాల్గవ రోజులో భాగంగా దేశానికి విశిష్ట సేవలు అందించిన 70 మంది సైనిక సిబ్బంది రక్షణ శాస్త్రవేత్తలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత భయ్యాజీ జోషి హాజరయ్యారు. విశిష్ట సేవలందించి సత్కారం పొందిన వారిలో ఆపరేషన్ సింధూర్ సమయంలో వీర మరణం పొందిన 6గురు సైనికుల కుటుంబాలతో పాటు, ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని కూడా ఘనంగా సన్మానించారు. కెప్టెన్ యోగేంద్ర సింగ్ యాదవ్, కార్గిల్ యుద్ధ వీరుడు భారతదేశ అత్యున్నత శౌర్య పురస్కారం, పరమవీరచక్ర, అందుకున్న అతిపిన్న వయస్కుడు. కెప్టెన్ కే నచికేత, పాకిస్తాన్ కు చిక్కినప్పటికీ తీవ్రమైన మానసిక, శారీరక హింసను ఎదుర్కొంటూ ఎలాంటి రహస్యాలను వెల్లడించని వైమానిక దళ పైలెట్ ను సన్మానించారు. సుమారు 20 మంది రక్షణ శాస్త్రవేత్తలను అగ్ని, బ్రహ్మోస్, క్షిపణి కార్యక్రమాలకు తోడ్పడిన ఈ కార్యక్రమంలో సన్మానించారు. తదనంతరం శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ దేశానికి అంకితభావంతో, నిబద్ధతతో సేవ చేసిన భారతదేశ వీర పుత్రులను, శాస్త్రవేత్తలను గౌరవించడం తమకు ఎంతో గౌరవమని స్వామి తెలిపారు. కులాలు మతాలపరంగా ఎంతటి వైవిధ్యం ఉన్న భారతదేశ చరిత్ర అంతట ఒకే దేశంగా ఐక్యంగా నిలిచిందన్నారు.



